స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: జన సైనికులంతా ఎన్నికల సంగ్రామానికి సిద్ధంగా ఉండాలి. క్రమశిక్షణతో జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం, 32 వ డివిజన్లో పర్యటించారు. కార్పొరేటర్ శ్రీ కందుల నాగరాజు ఆధ్వర్యంలో తయారు చేయించిన ప్రచార రథాన్ని నాదెండ్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రతి జన సైనికుడు తన పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ ల్లోని ఓటర్ల వివరాలపై జాగురకతతో ఉండాలని అన్నారు. ఎప్పటికప్పుడు పాలకులు తమకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను జాబితా నుంచి తీసివేసే చర్యలను పసిగట్టాలని తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో పార్టీ కోసం రోజులో కనీసం రెండు గంటలైనా కేటాయించాలని.. ఓ గొప్ప ఆశయం సాధించడానికి జన సైనికులంతా తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.


