25.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

మాయాబజార్‌లా ఇది కూడా హిట్ అవ్వాలి: మురళీమోహన్

టెంపుల్ మీడియా పతాకంపై సి. జగన్మోహన్ ( మాయాబజార్ జగన్మోహన్ ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S-99 ‘. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే.. కాగా ఈ చిత్ర మొదటి టీజర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా, రెండవ టీజర్ ను నేడు మురళీమోహన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ‘‘గతంలో మాయాబజార్‌ను కలర్ చేసి విజయాన్ని అందుకున్న జగన్మోహన్ గారు తాజాగా S-99 చిత్రానికి దర్శకత్వం వహించారు. S-99 టీజర్ 2 విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మాయాబజార్‌లాగా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

చిత్ర దర్శకుడు జగన్మోహన్ మాట్లాడుతూ, ‘‘S-99 ‘ రెండో టీజర్‌ను మురళీమోహన్ గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన నాలుగు టీజర్‌లను సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ నెలలో రిలీజ్ చేసి, సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్వేతా వర్మ, ప్రొడ్యూసర్ యతీష్ పాల్గొన్నారు.

హీరో: జగన్మోహన్
హీరోయిన్: శ్వేతా వర్మ
కెమెరా:వీ. శ్రీనివాస్
ఎడిటర్: సనాల్ అనిరుదన్
డైరెక్టర్: జగన్మోహన్
ప్రొడ్యూసర్స్: యతీష్ అండ్ నందిని
పి ఆర్ ఓ :బి. వీరబాబు

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్