రిజెక్షన్స్ తగ్గాలని, లబ్ధిదారులు పెరగాలని కేంద్ర పథకాల అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో బ్యాంకర్లు, అధికారులకు ఎంపీ డీకే అరుణ దిశానిర్దేశం మహబూబ్‌నగర్ పార్లమెంటరీ స్థానం పరిధిలో కేంద్రప్రభుత్వ పథకాలపై అరుణ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, PMEGP, PMFME అమలుపై ఆమె సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు, లబ్దిదారుల ఎంపిక, రిజెక్షన్స్‌పై కీలకంగా చర్చించారు. పథకాల అమలులో బ్యాంకర్ల పనితీరు, సబ్సిడీ, గైడ్‌లైన్స్‌పై ఆమె అధికారులతో చర్చలు జరిపారు. తమ పరిధిలో విశ్వకర్మ యోజన, PMEGP, PMFME పథకాలకు ఇచ్చిన లోన్స్, లబ్ధిదారుల ఎంపికపై ఎస్బీఐ, కెనరా, గ్రామీణ వికాస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అధికారులు వివరణ ఇచ్చారు.