ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని.. అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీతో పొల్చుకునే స్థాయి కాదని.. కులగణనపై అభ్యంతరాలు ఉంటే.. శానసనమండలిలో మాట్లాడొచ్చని సూచించారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చాం.. అది సరిపోదా అని మంత్రి సీతక్క అన్నారు.