YS Viveka murder case | తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఛీఫ్ జస్టిస్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఛీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపనుంది.