MP Avinash Reddy | కడప జిల్లా పులివెందులలోని బాకరాపురం నుంచి హైదరాబాద్ బయల్దేరారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఆదివారం నోటీసులు పంపింది సీబీఐ. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో నిన్న(ఆదివారం) అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించి సీబీఐ అరెస్టు చేసి… ఆపై 14 రోజుల రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించింది.


