తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ప్రొడ్యూసర్ బజార్ నిర్వహించిన ఈ సదస్సులో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో వ్యయప్రయాసలతో… జీవితాలను పణంగా పెట్టి నిర్మాతలు రూపొందించిన కంటెంట్ పై వారికి ఎప్పటికీ కొన్ని హక్కులు ఉంటాయి. ఏదో ఒకసారి, లేదా ఏదో ఒక మార్గంలో ఆదాయం ఇచ్చేది కాదు కంటెంట్ అంటే. ఈ డిజిటల్ యుగంలో మంచి కంటెంట్ అనేది నిర్మాతలకు కల్పతరువు వంటిది” అంటూ ఎంతో విపులంగా విశదీకరించారు!!
“ఐ.పి.రైట్స్ – కాపి రైట్స్ ఇన్ సినిమా” అనే అత్యంత కీలకమైన అంశాలపై ఇప్పటికే… ప్రొడ్యూసర్ బజార్ తమిళ, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఛాంబర్స్ సహకారంతో అక్కడి నిర్మాతలకు సమగ్ర అవగాహన కల్పించింది. అక్కడి నిర్మాతలందరూ ఈ అవగాహన తాలూకు సత్ఫలితాలు పొందడం కూడా మొదలైంది. ఇప్పుడు… తెలుగు నిర్మాతలలోనూ ఈ అవగాహన పెంపొందించేందుకు నడుం కట్టింది ప్రొడ్యూసర్ బజార్. అందులో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో జత కట్టి ఈ సదస్సును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది!!
ఈ డిజిటల్ యుగంలో తెలుగు సినిమా కంటెంట్ కు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ రీతిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని… వివిధ ఆదాయ మార్గాలపై, హక్కులకు సంబంధించిన పలు రకాల అంశాలపై ప్రతి నిర్మాత పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సదస్సు నొక్కి చెప్పింది!!
ప్రొడ్యూసర్ బజార్ వ్యవస్థాపకులు జి.కె.తిరుణావకరసు, విజయ్, ఐ.పి.రైట్స్ – కాపి రైట్స్ అంశాల్లో నిష్ణాతులు, సుప్రసిద్ధ సుప్రీం కోర్టు లాయర్ భరత్ లతో పాటు… తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలుగు దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఎన్.ఆదిత్య, ప్రముఖ నిర్మాతలు స్రవంతి రవికిషోర్, జెమిని కిరణ్, శరత్ మరార్, సుప్రియ యార్లగడ్డ (అన్నపూర్ణ స్టూడియో), బెక్కం వేణుగోపాల్, వల్లూరిపల్లి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ బజార్ నిర్వహించిన ఈ సదస్సు ప్రతి నిర్మాతకు ఒక సంజీవని కాగలదని పేర్కొని, సదస్సు సిర్వాహకులు ప్రొడ్యూసర్ బజార్ వారికి కృతజ్ఞతలు తెలిపారు!!