స్వతంత్ర వెబ్ డెస్క్: కౌలు రైతులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లోన్ చార్జ్ మాడ్యూల్ లో ఇప్పటివరకు భూయజమానుల వివరాలే ఉండగా….తాజాగా వెబ్ ల్యాండ్ పోర్టల్ తో CCRC పోర్టల్ ను లింక్ చేశారు. దీంతో ఇకపై భూ యజమానులతో పాటు కౌలుదారుల వివరాలు సైతం బ్యాంకర్లు తెలుసుకొని, పంట రుణాలు వారికి సులభంగా మంజూరు చేసే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్ లో కౌలు రైతులకు రూ. 4 వేల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా, ఏపీలో కుల గణన చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 15 తర్వాత రాష్ట్రమంతటా కులాల వారీగా అధికారిక సర్వే ప్రారంభించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొని ఇంటింటా వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం యాప్ రూపొందిస్తున్నారు. పారదర్శకత కోసం మొత్తం మూడు స్థాయిల్లో షాంపిళ్లను పునః పరిశీలన చేస్తారు. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కుల గణన ప్రారంభమైంది.