29.4 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

కాంగ్రెస్‌పై మోదీ బాణాలు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్ లల్లా మళ్లీ గుడారంలో ఉండక తప్పదని, వారు రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. మోదీ చేసిన కామెంట్స్‌ను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా ఖండించారు. రాం మందిర్ పై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలని అనుకుం టోందని మోదీ చేసిన ఆరోపణలపై నేతలు మండిపడుతున్నారు.

ప్రధాని మోదీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మోదీ ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారని కానీ ఏనాడూ దాని సిద్దాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వ‌స్తే, రామ‌ మందిరంపైకి బుల్డోజ‌ర్లు వెళ్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎవరి పైనా బుల్డోజర్ ప్రయోగించలేదని అన్నారు. మోదీకి మాత్రమే ఆ అలవాటు ఉందని చెప్పారు. రాజ్యాం గం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయని, దానిని ఎవరూ ముట్టుకోలేరని ఖర్గే స్పష్టం చేశారు.

మరోవైపు… కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి రానివాళ్లంతా హిందువులు కానట్టేనా? అంటూ ఎదురు ప్రశ్నించారు. తాము ఆఖరి క్షణంలో రాముడిని తలుచుకుంటూ అంటూ కన్నుమూసిన గాంధీజీ అనుచ రులమని ప్రియాంక గాంధీ చెప్పారు. అలాంటి తమని హిందూ వ్యతిరేకులంటూ మోదీ ఆరోపిం చడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు.

బుల్‌డోజర్లను ఎక్కడ ఉపయోగించాలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుంచి చేర్చుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై జైరాం రమేశ్‌ ఘాటుగా స్పందించారు. యూపీ ముఖ్యమంత్రి బుల్‌డోజర్ దళితులు, గిరిజనులు, బెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల విధానానికి యోగి బుల్‌డోజర్ ఎంత వ్యతిరేకమో చూడండి అంటూ యోగి ఆదిత్యనాథ్‌ వెబ్‌సైట్‌లోని ఒక వ్యాసాన్ని జైరాం రమేశ్‌ ఎక్స్‌ లో షేర్‌ చేశారు.

మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండి పడ్డారు. ప్రార్థన మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ అధికా రంలోకి వస్తే రామ్‌లల్లా మీద బుల్డోజర్ తీసుకొస్తారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ లల్లా దర్శనం కోసం గేట్లు తెరచింది రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. 1986లో రామ్ లల్లా దర్శనం కోసం గేట్లు తీశారని, నాడు నరేంద్ర మోదీ ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్