ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నారు నరేంద్రమోదీ. హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే కొత్త మంత్రివర్గం కొలువు దీరనుంది. అందుకోసం కేంద్ర మంత్రుల జాబితా విడుదల చేయగా, తెలుగు రాష్ట్రాలకు అవకా శం దక్కింది. మరి లిస్టులో ఉన్నదెవరు..? అవకాశం దక్కించుకున్న నేతలెవరు..?
నరేంద్ర మోదీ ఆశలు ఫలించాయి. ఒక్క మోదీనే కాదు. కమలనాథుల కలలు నెరవేరాయి. యావత్ బీజేపీ శ్రేణులు ఆశించినట్టు ఆ పార్టీ హ్యాట్రిక్ కొట్టి ముచ్చటగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీకే అవకాశం దక్కింది. అలాగే సర్కార్ ఏర్పాటుకు సహక రించిన పార్టీలకు అవకాశం దక్కింది. దీంతో పలు రాష్ట్రాల నుంచి కేంద్రంలో కీలక పదవులు దక్కించు కున్నారు ఏన్డీఏ నేతలు. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో ఐదుగురికి సెంట్రల్ మినిస్టర్ పదవులు వరిం చాయి. అందులో ఇప్పటికే కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్‌రెడ్డికి మరోసారి అదృష్టం కలిసివ చ్చింది. కొత్తగా కొలువుదీరే మంత్రివర్గంలో చోటు దక్కింది. అదే విధంగా అంతా ఊహించినట్టే, బండి సంజయ్ ఆశపడినట్టే అనుకున్న కల నెరవేరింది. బండికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించింది బీజేపీ హైకమాండ్.
ఇక ఏపీలోనూ ముగ్గురికి కేంద్ర మంత్రి పదవి వరించింది. టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్‌తోపాటు బీజపీ పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించింది బీజేపీ అధి ష్టానం. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి పార్టీ వర్గాలు. తెలంగాణలో మునుపెన్నడూ లేనంతగా 8 సీట్లను కైవసం చేసుకుంది కమలం దండు. అలాగే ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీ అయిన టీడీపీ చారిత్రాత్మక విజయం సాధించి.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైంది. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ప్రాధాన్యత దక్కించుకుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా తెలంగాణలో విజయానికి, రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. బీఆర్‌ఎస్‌ను మట్టికరిపించడంతోపాటు.. ప్రస్తుతం అధికార పగ్గాలు చేపట్టి ఫుల్ జోష్‌లో ఉన్న హస్తం హవాను తట్టుకుని వారితో సమంగా సీట్లను సాధించింది బీజేపీ. కాంగ్రెస్ 8 స్థానాలను కైవసం చేసుకుంటే, అదే సంఖ్యతో 8 చోట్ల కాషాయ జెండా ను రెపరెపలాడించింది. ఇక ఏపీలోనూ ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలను సాధించింది. 17 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలకున్న కమలనాథుల కలలు ఫలించాయి. దీంతో ఏపీ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించింది ఆ పార్టీ హైకమాండ్. మరోపక్క ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన ఇతర రాష్ట్ర పార్టీలకు కూడా కేంద్రమంత్రి పదవులు దక్కాయి.
మరోవైపు కేంద్రమంత్రుల లిస్టులో పురందేశ్వరితోపాటు జనసేనకు అవకాశం దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కూటమి ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించిన జనసేనను ఎందుకు పక్కన పెట్టిందన్న చర్చ జోరుగా సాగుతోంది. జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలుపొందారు. అయితే, జనసేన నుంచి బాలశౌరికి అవకాశమిస్తారని ప్రచారం జరిగినా లిస్టులో మాత్రం ఆయన పేరు లేకపో వడంపై కేడర్ లో అసంతృప్తి కనిపిస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి రావటానికి టీడీపీకి తిరిగి సీఎం పదవి దక్కటానికి ప్రధాన కారణమైన పవన్‌కల్యాణ్ పార్టీని పక్కన పెట్టడంపై జనసైనికులు పెదవి విరుస్తు న్నారు. అసలు కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా..? ఎవరి పేరు సూచించ లేదా లేక ఏం జరిగిందనేది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


