బీజేపీ మతతత్వ పార్టీ అని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. బీజేపీ అరాచకాలను 10 ఏళ్లుగా చూస్తున్నామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగురవేశారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ అవమానించిందన్నారు. దేశానికి మోడీ చేసింది ఏమీ లేదన్నారు. హర్ గర్‌ను మోడీ మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ మోసం చేశారని.. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని షర్మిల ఫైర్ అయ్యారు.