సంక్రాంతి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. వాడవాడలా అందమైన రంగవల్లులతో పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో అయితే పండుగ వేళ సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మహిళలు వేసిన పెద్ద పెద్ద ముగ్గులు ఆకట్టుకుంటున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా సంప్రదాయ బద్ధంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నారు.
సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా ఎమ్మెల్సీ కవిత జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత స్వయంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. ఆమె ముగ్గు వేస్తుండగా భర్త, కొడుకు తనతోనే ఉన్నారు. ఆమె స్వయంగా ముగ్గును వేసి రంగులు చల్లి పూలతో అలంకరించారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారామె. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు ఎమ్మెల్సీ కవిత.