కేసీఆర్ మొక్క కాదు.. వేగుచుక్క అన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని ఆరోపించారామె. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమన్నారు. రేవంత్‌రెడ్డి గురువులకు చుక్కలు చూపించిన శక్తి కేసీఆర్ అన్నారు కవిత. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత.