22.7 C
Hyderabad
Sunday, October 26, 2025
spot_img

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సిద్ధం

    ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధం అంటున్నారు. క్యాంపు రాజకీయాలతో పార్టీలు పొలిటికల్ హీట్ పెంచాయి. సీటు నిలుపుకోవడానికి బిఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా … కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విహారయాత్రలతో ఓటర్లను మచ్చిక చేసుకుంటు న్నాయి రాజకీయ పార్టీలు. క్రాస్ ఓటింగ్ పైనే రెండు పార్టీలు ఆధారపడ్డాయి. ఒక్కో ఓటుకు మూడు నుంచి ఐదు లక్షల బంపర్ ఆఫర్ అని ప్రచారం సాగుతోంది. ఓటర్లు ఏ పార్టీకి విజయాన్ని అందిస్తారో చూద్దాం.

     పార్లమెంటు ఎన్నికలకు ముందే పాలమూరు జిల్లాకు ఓట్ల పండుగ వచ్చేసింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈనెల 28న ఎన్నికల పోలింగ్. దీంతో ఓటర్లను కాపాడుకోవడానికి ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలు తంటాలు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,439 మంది ఓటర్లు .వారిలో జెడ్పిటిసిలు ,ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు. 2021లో టిఆర్ఎస్ పార్టీ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతకుముందే డిసెంబర్ 8న ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాచేసి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

    ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ సమీకరణలు షురూ అయ్యాయి. జీవన్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బిఆర్ఎస్ పార్టీ తరఫున జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 1439 మంది ఓటర్లలో సుమారు 900 దాకా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే. మిగతా వారిలో కాంగ్రెస్ ,బిజెపి పార్టీ ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ,బిజెపి ,బిఆర్ఎస్ పార్టీ లు ఈ స్థానిక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం.. వచ్చే పార్లమెంటు ఎన్నికల పై పడే అవకాశం ఉందన్న భావనతో అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

   గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ ముందుకు సాగుతున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్కో ఓటుకు మూడు లక్షల నుంచి 5 లక్షలు ఇచ్చేలా ఒప్పందాలు సాగుతున్నాయని ప్రచారం. ఎన్నికలకు మరో రెండు రోజులే ఉండడంతో …బీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెర లేపాయి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం తో పాటు గోవా, కొడైకెనాల్, ఊటీ వంటి విహారయాత్రలకు ప్రజాప్రతినిధులను పంపించి విందు, వినోదాలతో ముంచెత్తుతున్నారు. వారిని నేరుగా 28న ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు, నిరంజన్ రెడ్డి ,శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు గోవా లో తమ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఎక్కడా కూడా తమ ఓటర్ జారిపోకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ ఎస్ ఓటర్ల బాధ్యతలను ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లకు అప్పగించింది.

   కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. బీఆర్ఎస్ తరఫున జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి పోటీపడు తున్నారు. కేసీఆర్ స్వయంగా నవీన్ కుమార్ రెడ్డికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బి ఫాం అందించారు. నామినేషన్ల అనంతరం రెండు పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. మరోసారి ఎమ్మెల్సీ గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ లో బిఆర్ఎస్ పార్టీ ఉండగా. ఎలాగైనా ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం దానికి తోడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ పై ఈ ఎన్నికలు ప్రభావం ఉంటుందన్న ఆలోచనలతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. రెండు రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ గెలిచేం దుకు సాముచేస్తుండగా… ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆందోళన అభ్యర్థులలో ఉంది. క్రాస్ ఓటింగ్ ఎవరిని అందలం ఎక్కిస్తుందో.. చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్