Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

తెలంగాణలో భూగర్భ జలాల కలవరం

   మానవ మనుగడకు జీవనాధారం జలం. కేవలం మనుషులకే కాదు.. జగతి మొత్తానికి జీవ కోటి ప్రాణికి కావాల్సింది నీరే. ఒక రోజంతా తిండి లేకుండా ఉండగలం కానీ, నీళ్లు లేకుండా బతకలేం. తాగు, సాగు నీరు లేకుంటే విశ్వమే అంతమయ్యే దుస్థితి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటే సస్యశ్యామలం. లేదంటే కరువు కాటకాలే. అలాంటి పరిస్థితే తెలంగాణలోనూ రావొచ్చంటూ, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు పర్యావరణ నిపుణులు.

    తెలంగాణలో భూగర్భ జలాలు తగ్గాయని హెచ్చరించింది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. ప్రతి ఏడాది వర్షా కాలానికి ముందు, ఆ తర్వాత భూగర్భ జలాలను పరిశీలిస్తుంటారు. జలాల లోతు తెలుసుకునేందుకు 1768 చోట్ల బోర్లు వేసి గ్రౌంట్‌ లెవల్‌లో వాటర్‌ పరిస్థితిపై లెక్కలేస్తుంటారు. అలాగే ఈసారి కూడా రీసెర్చ్‌ చేసిన నిపుణులు.. భూగర్భంలో నీటిమట్టం 8.7 మీటర్లకు చేరిందని తెలిపింది. మాడు పగిలే ఎండలతో ఈ సంఖ్య మరింత తగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలపై అధికారులు హెచ్చరిస్తున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయినప్పటికీ భూగర్భ జలాలు తగ్గడం అందరినీ కలవరపెడుతోంది. అధిక వర్షాలు పడితేనే పరిస్థితి ఇలా ఉంటే,..సాధారణం కంటే తక్కువ వర్షాలు పడితే అన్న ఆలోచనలే ఆందోళన కలిగిస్తోంది.

   ఇక భూగర్భ జలాల లెక్కలు చూసుకుంటే గత ఏడాది ఫిబ్రవరిలో 7.3 మీటర్లకు నీటి మట్టం ఉంటే ఈ ఫిబ్రవరి కి 8.7 మీటర్లకు చేరింది. 2022లో వర్షాలు బాగా పడినందుకు 2023 మేలో 8.3 మీటర్లకు నీటి మట్టం చేరింది. కానీ గత ఏడాది వర్షాలు సాధారణం కంటే కొద్ది ఎక్కువగా పడడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సరాసరి నీటి మట్టం 8.7 మీటర్లకు చేరింది. అంటే వచ్చే మే నెలలో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే బెంగళూరు దుస్థితి మనక్కూడా తప్పదు.

  నీటి కటకటతో బెంగళూరు నగరం అల్లాడుతోంది. ఎండాకాలానికి ముందే కన్నడ వాసులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకప్పుడు కోవిడ్ మహమ్మారి కోసం వర్క్‌ ఫ్రమ్‌ హోం అన్న ఐటీ సంస్థలు ఇప్పుడు నీటి కటకటతో మీ స్వస్థలాకు వెళ్లిపోండంటూ హెచ్చిరిస్తున్నాయట. అంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో అర్థమవుతుంది కదా. నీళ్లు దొరక్కపోవడంతో అత్యవసరమైతే నీటిని వినియోగిస్తు న్నా రట. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క చుట్టం వచ్చినా భారంగా భావిస్తున్నారట. నీటిని వృధా చేస్తే భారీగా ఫైన్లు విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయట కొన్ని హౌసింగ్ సొసైటీలు. నీటి కొరతతో ఇక ఇదే అదునుగా వాటర్‌ ట్యాంకర్‌ ఓనర్లు భారీగా దండుకోవడంతో కర్ణాటక సర్కార్‌ ట్యాంకర్లకు ఓ రేటు నిర్ణయించింది. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ ప్రజలకు సూచించింది. భూగర్భ జలాలు మరింత తగ్గితే తెలంగాణలోనూ ఇదే పరిస్థితులు వచ్చే అవకాశముందనీ ఇరిగేషన్‌ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వేసవి కాలంలో తాగే నీళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని,.. భూగర్భ జలాలను పరిశీలించాలని నీటి పొదుపుకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు సైతం ప్రభుత్వానికి సూచిం చింది.

    నీటి మట్టం 20 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని డేంజర్ జోన్‌గా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పరిగణిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో భూపాలపల్లి, భువనగిరి, హైదరాబాద్, మహబూబ్ బాద్ , ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, ఇలా 24 జిల్లాలో 82 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాద కర స్థాయిలో ఉన్నట్టు వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం ఒక మనిషి అవసరాల కన్నా తక్కువ భూగర్భ జలాలు ఉండడం.. అంతకు మించి నీటినీ తోడేయడంతో నీటి కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వచ్చే ఐదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కొనసాగితే తెలంగాణ తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కో వాల్సి వస్తుందని.. అందుకే భూగర్భ జలాలను పెంచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచిస్తు న్నారు నిపుణులు. నీటి వృధాను అరికట్టి , చెరువుల కబ్జాలకు గురికాకుండా, కొత్త చెరువులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను చైతన్య పరుస్తూ నీటి వృధాను అరికట్టి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్