29.2 C
Hyderabad
Friday, May 1, 2026
spot_img

మాజీ మంత్రి ఫరూక్‌ను కలిసిన ఎమ్మెల్సీ ఇక్బాల్‌

   వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఇక్బాల్‌ టీడీపీలో చేరుతున్నారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాజీమంత్రి ఫరూక్‌ను, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్బాల్‌ తనను కలవడం చాలా సంతోషంగా ఉందని… శాసనమండలిలో ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తులలో ఇక్బాల్‌ కూడా ఒకరని ఫరూక్‌ తెలిపారు. మైనార్టీ హక్కుల గురించి, మైనార్టీ పరిరక్షణ కోసం ఇక్బాల్‌ పోరాటం చేశారన్నారు. సీఎం జగన్‌ మైనార్టీల ద్రోహి అని.. ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ విమర్శించారు. మైనార్టీలకు వైసీపీలో సముచిత స్థానం దక్కడం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే వ్యవస్థలలో మార్పు రావాలన్నారు. ప్రజలకు న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. టీడీపీలో చేరికపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానన్నారు ఎమ్మెల్సీ ఇక్బాల్‌.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్