పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులు అరిగోసపడ్డారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ టూ ఇంక్లైన్ గనిపై ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గని ఆవరణలో కార్మికులను కలుసుకుని సమస్యలపై చర్చించారు. కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని కొప్పుల ఈశ్వర్.. ఎన్నికల వేళ వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నా రన్నారు. ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు వివేక్ వెంకటస్వామి కృషి చేశారని, విద్యుత్ సంస్థల ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ నాయకుల చొరవేనని ఎమ్మెల్యే గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ బూటకపు మాటలు నమ్మకుండా మంచి చేసే కాంగ్రెస్కు ఓటు వేయాలని రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిం చాలని ఆయన కోరారు.


