శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గొండు శంకర తెలిపారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రంథాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేదన్నారు. మున్సిపాలిటీ నుంచి రావాల్సిన గ్రంధాలయ పన్నులు సకాలంలో అందక సిబ్బందికి కూడా జీతాలు అందడం లేదని చెప్పారు. పంచాయతీ నిధులను గల్లంతు చేయడం వల్లనే గ్రంథాలయాలకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. గ్రంథా లయంలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, కంప్యూటర్లను సైతం రెండు రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తెస్తానని నిరుద్యోగులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.