చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి శ్రీధర్ బాబు, పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఆయనపై దాడిని ఖండించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్‌పై దాడికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రామరాజ్యం పేరిట హింసాత్మక చర్యలకు పాల్పడితే ఉపేక్షించమని స్పష్టం చేశారు. చిలుకూరు ఆలయం వద్ద భద్రతను పెంచాలని అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.