విద్వేషం, విధ్వంసం బీజేపీ విధానమైతే… ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. రాహుల్ గాంధీపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం కులగణన అని అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కుల గణన కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆక్షేపించారు విభజన రాజకీయాలతో పదవులు పొందటం బీజేపీ నైజం అని మంత్రి సీతక్క విమర్శించారు.