సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్ధుల్ని అడిగి సమస్యల్ని తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్‌తోపాటు తాగు నీరు, వీధి దీపాల సమస్యల్ని మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు విద్యార్ధినులు. దీంతో సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అదేశించారు. పూర్తయిన నూతన భవనంలోకి కళాశాలను ఎందుకు షిఫ్ట్ చేయలేదంటూ ప్రిన్సిపల్ ను ప్రశ్నించిన మంత్రి రేపటికల్లా షిష్ట్ చేయాలంటూ ఆదేశాలిచ్చారు.