బీఆర్ఎస్ నేతల తీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనురులో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నామని.. ఏదైనా చిన్న విషయాన్ని పెద్దది చేసి.. మాట్లాడటం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తే బిఆరెస్ నేతలకు కంటగింపుగా ఉందనిపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వ్యక్తిగత పర్యటనపై ఆరోపణలు చేస్తున్నారని.. మంచిది కాదని పొన్నం హితవు పలికారు. పదేళ్లుగా ఫాం హౌస్ నుండి కనీసం సెక్రటేరియట్ కి రాని కేసీఆర్ ఉంటే.. ప్రజల బాగు కోసం.. పెట్టుబడులు తెస్తున్న రేవంత్ ను విమర్శిస్తున్న తీరును ప్రజలు ఆలోచన చేయాలని పొన్నం అన్నారు.