స్వతంత్ర వెబ్ డెస్క్: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ (CM Jagan) నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ల (Electrical Employees Demands)పై సీఎంతో చర్చించామని, విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదని అన్నారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో 4 గంటలకు విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. ఉద్యోగుల సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారంపై చర్చిస్తామన్నారు. అలాగే సచివాలయంలో ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరుపుతామన్నారు. డిమాండ్ల పరిష్కారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం సచివాలయంలో చర్చలకు రావాలని ఉద్యోగుల ఐకాస నేతలను ఆహ్వానించామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.


