మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణం చేయాలన్న జగన్ వ్యాఖ్యలను ఖడించారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లేదని, అందుకే సీఎం తర్వాత మంత్రులు ప్రమాణం చేశారని చెప్పారు. జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదని చెప్పారు. మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్షనేత హోదా ఇస్తారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారని విమర్శిం చారు. ప్రతిపక్ష నేతగా ఉంటే క్యాబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.1984లో ఉపేందర్‌కు అసలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్లు పట్టిందని మంత్రి పయ్యావుల చెప్పారు.
జగన్ కు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్
0
387
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


