స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానపద గాయకుడు గిద్దె రామ నరసయ్యను ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆయనతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో మీ పాట ద్వారా చేసిన సేవలు మరిచిపోలేమని.. మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మీరు నిశ్చింతగా ధైర్యంగా ఉండాలని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా, రామ నరసయ్య అనారోగ్యంగా ఉన్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి.. నిమ్స్ కు తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించిన విషయం తెల్సిందే.