స్వతంత్ర వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. పవన్‌కల్యాణ్.. ఈపేరు చెబితే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి.. బాక్సాఫీస్‌లు బద్దలైపోతాయి. జీవితంలో ఒక్కసారైనా ఆయన్ను చూడాలని, కలవాలని అభిమానులు పరితపిస్తుంటారు. అభిమానులకు దగ్గరగా ఉండేందుకు సినిమా హీరోలు సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లో మాత్రమే ఉన్న జనసేనాని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టాడు. మంగళవారం ఉదయం ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అందుబాటులోకి రాగా, కొద్దిసేపటికే వెరిఫైడ్ కూడా లభించింది. ఇక ఖాతాను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్‌ను దాటేశారు.
ట్విటర్ ఖాతాకు జత చేసిన ప్రొఫైల్ ఫొటోనే ఇన్ స్టాగ్రామ్‌కు కూడా వినియోగించారు. ప్రస్తుతం ట్విటర్ వేదికగా ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టా వేదికగా రాజకీయాలతో పాటు, సినిమా విశేషాలను కూడా షేర్ చేయనున్నట్లు సమాచారం. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్!” అనే స్లోగన్ ను చేర్చారు.