‘మీ కడుపునిండా’ తెలుగువారి రుచులు ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘‘శ్రీవాణి సీరియల్స్‌లో మనందరికీ తెలిసిన వ్యక్తి. శ్రీవాణి, విక్రమాదిత్య, సందీప్‌లకు నా శుభాకాంక్షలు. సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది మణికొండలో ఉంటున్నారు. సో మణికొండలో ఉన్న వారందరికీ అందుబాటులో దగ్గరగా ఉండేలాగా మీ కడుపునిండాని ప్రారంభించారు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రొయ్యల ఇగురు చేపల పులుసు ఇవన్నీ నాకు ఇష్టం. నేను వంట కూడా బాగా చేస్తాను. కానీ నేను చేసిన దానికి నా భర్త, పిల్లలు ఎలా ఉందని వాళ్లే చెప్పాలి. అలాగే ఈ మీ కడుపునిండాలో వెజ్, నాన్ వెజ్ వంటకాలు అన్నీ కూడా ఆంధ్ర స్టైల్‌లో అందుబాటులో ఉంటాయి. అచ్చమైన తెలుగు వంటకాలు ఇక్కడ కచ్చితంగా లభిస్తాయి. సో తెలుగు వారందరూ ఇక్కడొకసారి వచ్చి టేస్ట్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.


