28.4 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

న్యూడ్ వీడియోల కేసులో మస్తాన్ సాయి అరెస్ట్

అమ్మాయిల న్యూడ్ వీడియోల కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిల నగ్నవీడియోలు దాచుకుని… వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటూ మస్తాన్‌సాయిపై లావణ్య ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన ఒక హార్డ్ డిస్క్‌ను సైతం ఆమె నార్సింగ్ పోలీసులకు అందించింది. దీంతో అతడిని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హీరో రాజ్ తరుణ్, లావణ్యల విషయంలో మొదటి నుంచి మస్తాన్ సాయి పేరు వనిపిస్తోంది. ఈ వ్యవహారం కంటే ముందే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్టు అయ్యాడు. ఇదే కేసులో లావణ్య సైతం అరెస్టు అయింది. ఈ డ్రగ్స్ కేసులో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు చాలా వరకు మస్తాన్ సాయి సేకరించి… తన హార్డ్ డిస్క్‌లో పొందుపరిచాడు. ఇలా దాదాపు 300 వీడియోలను మస్తాన్ సాయి సేకరించినట్లు సమాచారం.

సెలబ్రెటీల ప్రైవేట్ పార్టీలకు సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు, యువతుల కాల్ రికార్డింగ్స్, వాళ్లతో న్యూడ్ వీడియో కాల్స్ వంటివి ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. లావణ్యపై అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి ఆ వీడియోని కూడా రికార్డ్ చేశాడట. తన వీడియోలు డిలీట్ చేయాలని అడగడంతోనే లావణ్యపై మస్తాన్ సాయి దాడి చేశాడని తెలుస్తోంది. అమ్మాయిలను డ్రగ్స్‌కి బానిసలుగా చేసి ఆ తర్వాత లోబరుచుకోవడం మస్తాన్ సాయికి పరిపాటిగా మారిపోయిందట.

మస్తాన్ సాయి కేసులో ఓ బిగ్ కన్ఫ్యూజన్ నడుస్తోంది. లావణ్యకి మస్తాన్ సాయితో వివాహేతర సంబంధం ఉందని రాజ్ తరుణ్, శేఖర్ బాషా గతంలో ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను లావణ్య అప్పుడు ఖండించింది. తనకు మస్తాన్ సాయి స్నేహితుడు అని… అంతకంటే తమ మధ్యం ఏం లేదని లావణ్య వాధించింది. మస్తాన్‌సాయి-లావణ్య కాల్ రికార్డింగ్స్ సైతం అప్పట్లో లీక్ అయ్యాయి. ఇప్పుడు అదే మస్తాన్ సాయిని లావణ్య స్వయంగా అరెస్టు చేయించింది. నాడు బెస్ట్ ఫ్రెండ్ అన్న లావణ్యనే… తాజాగా మస్తాన్ సాయిని అరెస్టు చేయించడంతో గందరగోళం నెలకొంది. అయితే ఈ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కస్టడీలోకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టనున్నారు పోలీసులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్