Fire Accedent |తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పద్మనగర్ లోని ప్లాస్టిక్ కవర్ల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఇరువైపులా వ్యాపించి.. చుట్టూ అంటుకున్నాయి. దీంతో భవనం అంతటా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో క్షణాల్లో చేరుకుని పూర్తిగా మంటల్ని ఆర్పేశారు.


