23.7 C
Hyderabad
Sunday, October 26, 2025
spot_img

మార్కెట్ సదుపాయం లేక మామిడి రైతుల ఇక్కట్లు

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరి తయారైంది బెల్లంపల్లి నియోజకవర్గ మామిడి రైతు పరిస్థితి. తోటలా ఎన్నో వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. రైతన్న శ్రమా వర్ణనాతీతం. దిగుబడా ఇబ్బడి ముబ్బడిగా ఉంది. మామిడి పంట రకాలా.. బంగినపల్లి, రసాలు, చక్కెర కేళి..ఇలాఎన్నెన్నో. అయినా, రైతు పరిస్థితి దయనీయం గా ఉంది. మార్కెటింగ్ సౌకర్యం లేక… నిక్షేపంలాంటి పంటను దళారులపరం చేయాల్సి వస్తోందని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా మామిడి రైతులు పడుతున్న కష్టాలపై ప్రత్యేక కథనం.

మామిడి మధుర ఫలం. ఇది నిజం. మంచిర్యాల జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి ఇదీ నూరు శాతం నిజమే. అయితే, జిల్లా మామిడి రైతు పరిస్థితి అత్యంత దయనీయం. ఇది చేదు నిజం. ఆరుగాలం శ్రమించి అధిక దిగుబడి సాధించిన రైతన్నకు పంట అమ్మకం ప్రశ్నార్థకం కావడం ఎంత దురదృష్టకరం. జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే పంట ఇక్కడ పండుతున్నా..మార్కెట్ సదుపాయం లేకపోవడంతో పంట దళారులపాలవుతోంది.

జిల్లాలో మొత్తం 16 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మామిడి సీజన్ రెండు నెలల్లో నెన్నెల, జైపూర్, భీమారం మండలాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా మామిడి ఎగుమతి అవుతుంది. దాదాపు 20 వేల లారీల మామిడి లోడ్ నాగ్ పూర్ మార్కెట్ కు తరలి వెళుతుంది. బంగినపల్లి, రసాలు, చక్కెర కేళి.. ఇలా పలు రకాల మామిడి నాగ్ పూర్ తో పాటు చంద్రపూర్ మార్కెట్ కు తరలివెళుతుంది. అక్కడి నుంచి నేరుగా బెల్లంపల్లి మామిడిని విదేశాలకు పంపిస్తారు.

   ఇక్కడి మామిడికి మంచి డిమాండ్ ఉంది. అయితే, మార్కెట్ లేకపోవడం, మామిడి కాయల విక్రయానికి సరైన సదుపాయాలు ఉండకపోవడంతో వందలాది మంది రైతులు దళారులకు లీజుకు ఇస్తున్నారు. ఈ లీజుతో ఎకరాకు కేవలం 20 వేల రూపాయల ఆదాయమే వస్తోంది. లక్షల రూపాయలు ఆర్జించే వీలున్నా మార్కెట్ సౌకర్యం లేక రైతులు వేల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు అయిదు దశాబ్దా లుగా… మార్కెట్ సౌకర్యం కల్గించమని ప్రజా ప్రతినిధులను, అధికారులను వేడుకొంటున్నా.. ఏ ఒక్కరి మనసు కరగడం లేదని మామిడి రైతులు వాపోతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో మూడేళ్ల క్రితం మూడు కోట్ల రూపాయలతో మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటు చేశారు. అయితే, అలంకార ప్రాయంగానే ఆ యార్డ్ మారింది. ఏళ్లు గడుస్తున్నా ఈ మార్కెట్ విని యోగంలోకి రాలేదు. అన్ని హంగులతో ప్రత్యేకంగా గొడౌన్, షెడ్లు నిర్మించిన అధికారులు…కొనుగోళ్లు చేపట్టడంలో మీన మేషాలు లెక్కపెడుతున్నారు. గత ప్రభుత్వా లు రైతులను పట్టించుకోలేదని, నూతన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యలు పట్టించుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. తమ నుంచి మామిడి నేరుగా కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు చేయడం సంతోషక రమని, అయితే శీతల గిడ్డంగి పనులు వెంటనే పూర్తిచేసి.. బెల్లంపల్లి మార్కెట్ యార్డ్ ను వెంటనే ప్రారంభిం చాలని రైతులు కోరుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్