మనదేశంలో వచ్చే మూడు నెలల్లో గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్ ఫోన్ల తయారీ మొదలవుతోంది. వచ్చే త్రైమాసికం నాటికి భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభించాలని గూగుల్ సరఫరా దారులను ఆదేశించింది. ఈ ఏడాది కోటికి పైగా పిక్సెల్ ఫోన్లను వినియోగదారులకు అందించే గూగుల్ ప్రణాళికలో ఇది ఒక భాగమని తెలిపింది. గూగుల్ భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభిస్తుం దని, దాని ఫ్లాగ్ షిప్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ 2024 లో అందుబాటులో ఉంటుందని కంపెనీ గత ఏడాది అక్టోబర్ లో ప్రకటించింది. భారతదేశంలో మార్కెట్ వృద్ధిపై గూగుల్ దృష్టి సారించింది.