హైదరాబాద్‌లో అనుమతులకు విరుద్ధంగా దగ్గు మందు తయారు చేస్తున్న కంపెనీపై అధికారులు కొరడా ఝుళిపించారు. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో దాడులు నిర్వహించారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. అఖిల్ లైఫ్ సైన్సెస్ కార్యాలయంలో సోదాలు జరపగా.. అనుమతులకు విరుద్ధంగా తయారు చేస్తున్న దగ్గు మందును పట్టుకున్నారు. 65 వేల రూపాయల విలువ చేసే స్టాక్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా దగ్గు వచ్చినప్పుడు వాడే గ్లైకోరిల్ కాఫ్ సిరప్‌ను వాడొద్దని సూచించారు. తయారీలో ఎలాంటి నిబంధనలను పాటించడం లేదని.. వీటివల్ల ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఇలాంటి దగ్గు మందులు ఎక్కడ కనిపించినా తమకు తెలిపాలని కోరారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు.