Free Porn
xbporn
22.1 C
Hyderabad
Thursday, September 19, 2024
spot_img

మామిడి … తగ్గిన దిగుబడి

   ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటల్లో మామిడిదే అగ్రస్థానం.అయితే గత ఏడాది వర్షాభావ పరిస్థితులు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల వలన సకాలంలో పూత రాలేదు.దీంతోపాటు శీతాకాలంలో దట్టంగా కురిసిన మంచు, ఆలస్యంగా వచ్చిన మామిడి పూతపై అధిక ప్రభావం చూపింది.దీంతో పూత కూడా నిలవలేదు.నీటి వనరు లేని మామిడి తోటలకు పిందె దశలో మరో దెబ్బ ఎదురైంది.దీంతో ఈ ఏడాది మామిడి దిగుబడి మరింత తగ్గిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంతంత మాత్రంగా వచ్చిన దిగుబడిపై అకాల వర్షాలు. ఈదురుగాలు ప్రభావంతోడైతే మామిడి రైతు ఈ ఏడాది మరింత నష్టపోయే రిస్థితి కనిపిస్తుంది. ఏటా కోట్ల రూపాయల వ్యాపారం సాగే మామిడి మార్కెట్, ఈ ఏడాది సంక్షోభంలో పడిందని, మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది తగ్గిన మామిడి దిగుబడిపై స్వతంత్ర ఛానెల్ ప్రత్యేక కథనం.

   వేసవి కాలంలో రోడ్లపై ఎక్కడ చూసినా పలు రకాల నోరూరించే రంగురంగుల మామిడి పండ్లు కనిపి స్తాయి. వేసవి తాపాన్ని తీర్చే తియ్యటి ఫలరాజాలు..పండించే మామిడి రైతుకు మాత్రం ఈ ఏడాది తీరని నష్టమే వాటిల్లింది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తోటలు అక్కడడక్కడా పచ్చగా కనిపించినా, సకాలంలో పూత రాక పూత వచ్చే సమయానికి, శీతాకాలంలో దట్టంగా కురిసిన మంచు పూతను మరింత దెబ్బతీసింది. దీంతో ఈ ఏడాది మామిడి దిగుబడి బాగా తగ్గిందని, మామిడి రైతులు ఆవేదన చెందుతు న్నారు. ఉద్యాన పంటల్లో అగ్రస్థానం అయిన మామిడి పంట ఈ ఏడాది మూడువంతులకుపైగా దిగుబడిని కోల్పోయింది.

  వాస్తవానికి జనవరి మాసంలో మామిడి తోటల్లో మొగ్గలతో పూత విరివిగా కనిపిస్తుంది. ఈ ఏడాది జనవరిలో 50 శాతం చెట్లలోనే పూత కనిపించింది. రైతులు, వ్యాపారులు అవగాహన లోపంతో మామిడి చెట్ల పూత నిలపాలని, విరివిగా క్రమిసంహారక మందులు పిచికారీ చేశారు. దీంతో అప్పుడే పూసిన పూతలోని పుప్పొడి రాలిపోయి, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పూత ఆలస్యం కావడంతో దిగుబడి కూడా బాగా తగ్గింది. గత రెండేళ్లుగా మామిడి సాగు మరింత కష్టమైందని రైతులు ఆవేదన చెందు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతులు అవగాహనా లోపంతో నష్టపోతే దీనికి తోడు కాలం కూడా మామిడి దిగుబడిపై కాటు వేసింది. దీంతో మామిడి రైతు కుదేల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది.

    దేశంలో మామిడి అధిక దిగుబడి వచ్చే రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం.అందులోనూ మామిడి ఎగుమతుల్లో నూజివీడు ప్రథమ స్థానం కాగా ద్వితీయ స్థానం చింతలపూడిది. ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం సాగించే మామిడి పరిశ్రమ ప్రస్తుతం సంక్షో భాన్ని ఎదుర్కొంటోంది. మామిడి ఎగుమతులు పూర్తిగా మందగించాయి. మామిడి సీజన్ ప్రారంభమై నెల కావస్తున్నా, ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేక వ్యాపారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా మామిడి మార్కెట్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. మామిడి దిగుబడి లేకపోవడం. కోతకు వచ్చిన కొద్దిపాటి కాయల్లో నాణ్యత లోపించడం వనల ఎగుమతులు పూర్తిగా మందగించాయని వ్యాపారులు చెబున్నారు. ఇదిలా ఉంటే మామిడి రైతులు కాయ సైజు ఆకర్షణీయంగా ఎదిగే వరకు చెట్టు మీద ఆపడానికి రైతులకు ధైర్యం సరిపోవడం లేదు. అకస్మాత్తుగా వచ్చే ఈదురగాలులు వడగళ్లవానలతో కాయ పూర్తిగా దెబ్బతింటుందుని, అకాల వర్షాలు వస్తే కాయలకు పురుగు సోకుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న కొద్దిపాటి దిగుబడిని నాణ్యత ఉన్నా లేకపోయినా అమ్మే పరిస్థితిలో మామిడి రైతులు ఉన్నారు. కానీ మార్కెట్ బలహీనంగా ఉన్న కారణంగా చెట్లమీదే కాయలు పండిరాలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మామిడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

    గత రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో మామిడి ఎగుమతి చేయలేక పోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఏటా ఇరవై వేల టన్నుల మామిడి పంట నూజివీడు. చింతలపూడి తదితర ప్రాంతాల నుండి కోల్‌కతా, నాగపూర్‌, గుజరాత్‌, హైదరాబాద్‌, పూనే, అహ్మదాబాద్‌, ఢిల్లీ, కాన్పూర్‌, ఒడిశా ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది సీజన్‌ ముగింపు దశకు వచ్చినప్ప టికీ కనీసం 5 వేల టన్నులు కూడా ఎగుమతి చేయ లేని పరిస్థితిలో మామిడి మార్కెట్ ఉందని వ్యాపారులంటున్నారు. ప్రస్తుతం బంగినపల్లి రకం టన్ను మామిడి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలుకుతోంది. కానీ అదీ మంచి సైజు, ఆకర్షణీయంగా ఎదిగిన మామిడికి మాత్రమే ఆ ధర పలుకుతుంది. ఇంకా వేల హెక్టార్ల మామిడి తోటల్లో కాయ సరైన సైజు ఎదగకపోడంతో చెట్లపైనే కాయలు పండిరాలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మామిడి రైతులు మరింత దిగాలుప డుతున్నారు. గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా.. మామిడి దిగుబడి పడిపోయిందని మార్కెట్ నిపుణుల చెబుతున్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో విస్తరించి ఉండే, మామిడి తోటలు ప్రస్తుతం బాగా తగ్గిపోయాయి. ఎరువులు… పురుగుల మందులు , దుక్కి ఖర్చులతో సహా మామిడి రైతుకు ఎకరాకు ఇరవై నుండి ముప్పైవేల చొప్పున ఖర్చవు తుంది. కానీ దిగుబడి మాత్రం ఏడాదికి ఏడాది క్షీణిస్తుంది.దీంతో ఒక్క ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రమే లక్షలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి తోటలను రైతులు తొలగించి, పామ్ ఆయిల్ సాగువైపు అడుగులు వేశారు. ప్రస్తుతం ఈ జిల్లాలో సుమారు 44 వేలహెక్టార్లలో
మామిడి స్థానంలో పామ్‌ ఆయిల్ సాగవుతోంది.

   మామిడి దిగుబడి తగ్గిన కారణంగా ఎగుమతులు కూడా మందగించాయి. ప్రారంభంలో టన్ను 50 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.30 వేలకు పడిపోయింది. అదికూడా కాయ ఆకర్షణీ యంగా ఉంటేనే ఈ ధర పలుకుతోంది. ప్రభుత్వం మామిడి రైతులను, వ్యాపారులను ప్రోత్సహించేలా శీతల గిడ్డంగులను నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇదిలాగే కొనసాగితే పూర్తిగా మామిడి కనుమరు గయ్యే పరిస్థితి కనిపిస్తుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.వ్యాపారులు మామిడి రైతుల నుంచి కొనుగోలు చేసిన కాయలను రవాణా ఖర్చులు పెరగడంతో మరింత భారంగా మారింది. మామిడి కాయల ప్యాకింగ్ ఖర్చు కూడా అధికమైందని మామిడి వ్యాపారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు ఈ ఏడాది తోటల్లో సరైన పంట కాపు లేక కేవలం 30 శాతం మాత్రమే దిగుబడి వచ్చింది.

   మామిడి ఎకరాకు 3 టన్నుల నుంచి 4 టన్నుల వరకు ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎకరాకు ఒకటి నుంచి రెండు టన్నుల మించిదిగుబడి రాని పరిస్థితి ఉంది. గత మూడేళ్ల నుంచి మామిడి మార్కెట్‌ ఆశాజనకంగా లేదని ఇటు రైతులు,  వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా కారణంగా మార్కెట్‌ దెబ్బ తింది. దీంతో మామిడి రైతులు, వ్యాపారులు బాగా నష్టపోయారు. గత ఏడాది కూడా పూత ఆలస్యంగా రావడం, దిగుబడులు కూడా ఆలస్యమయ్యాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాది ఎదురైంది. ఇతర రాష్ట్రాల్లో మార్కెట్‌ లేక వ్యాపారులు సైతం నష్టం చవిచూస్తున్నారు. ఏపీలో చింతలపూడి, నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, ద్వారకాతిరుమల, నల్లజర్ల, టి.నరసాపురం, జంగారెడ్డి గూడెం, లింగపాలెం, కామవరపుకోట ప్రాంతాల్లో సుమారు 15 వేల హెక్టార్లలో మాత్రమే మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మామిడి పరిశోధన కేంద్రాలు లేకపోవడం గమనార్హం. అక్కడక్కడా ఉన్నా పరిశోధన కేంద్రాలు రైతుల్లో అవగాహన కల్పిస్తున్న దాఖలాలు కూడా లేవని రైతులు చెబుతు న్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించాయి. కానీ ఈ ఏడాది సరైన దిగుబడి రాక మామిడి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం తరఫున రైతులకు మరింత ప్రోత్సాహం అందించి అవగాహన కల్పించకపోతే, భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉందని మామిడి పరిశోధన కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు.

Latest Articles

కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను బర్తరఫ్ చేయాలి – ఎమ్మెల్యే దానం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అంటూ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. రాహుల్ మీద విమర్శలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్