మరోసారి మాస్ డ్యాన్స్‌తో మాజీ మంత్రి మల్లారెడ్డి అదరగొట్టారు. ఏడు పదుల వయసులోనూ ఉత్సాహంగా డీజే టిల్లు పాటకు హుషారుగా స్టెప్పులేశారు. మనవరాలు వివాహానికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమంలో వేసిన ఈ స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ముందు అట్టహాసంగా సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో మల్లారెడ్డి తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. చాలా పాటలకు ఆయన డ్యాన్స్ వేసి అందరినీ అలరించారు. దీంతో చూసేవారందరూ రిపీట్ అంటూ గోల చేయడంతో పాటు ఈలలు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మంచి కాస్ట్యూమ్‌ను ధరించి మనవళ్ల పక్కన కొరియోగ్రాఫర్లతో కలిసి స్టెప్పులు వేశారు మల్లారెడ్డి.