సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ తనను తీవ్ర అప్రతిష్ఠ పాల్జేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతుల కు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. మహిళల ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్ ఛానెళ్లు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు ఉంటున్నాయని తెలిపారు. దాంతో సైబర్‌క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల్ని కలుస్తూ ప్రచారం ప్రారంభించానని షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో సోషల్ మీడియాలో తనపై.. తన సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని చెప్పారు. ఇవన్నీ నిరాధారమైనవే అయినా తనని అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


