స్వతంత్ర, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ బాగా ఎక్కువై పోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు అయితే మరి ఎక్కువ.. వారితో పటు వారి కుటుంబ సభ్యులను ట్రోల్ చేస్తుంటారు కొంతమంది. కొందరు ప్రముఖులు ఏమి ఉందిలే అని వదిలేసిన మరికొంతమంది గట్టిగా సమాధానం ఇస్తుంటారు. అదే కోవలో బాడీ షేమింగ్‌కి గురైన ఒక హీరో కుమార్తె తనని కామెంట్ చేసిన నెటిజెన్‌కి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది.
ప్రముఖ మలయాళీ నటుడు సురేశ్ గోపి కూతురు భాగ్య బాడీ షేమింగ్ కు గురయ్యారు. ఇటీవల ఆమె కెనడాలోని ఒక కాలేజీ నుంచి భాగ్య గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆమె ఈ ఫోటోల్లో సంప్రదాయ దుస్తులైన చీరలో కనిపించింది.అయితే ఇది చూసిన ఓ నెటిజన్.. ‘కంగ్రాట్స్.. మీరు చీరలు పక్కనపెట్టి వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోండి. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్లకు శారీ సెట్ కాదు. ఫ్యాషన్ దుస్తుల్లోనే మీరు చాలా స్మార్ట్‌గా ఉంటారు.’ అంటూ కామెంట్ చేశాడు.అయితే ఇది చూసిన భాగ్య అతనికి కాస్తా గట్టిగానే రిప్లై ఇచ్చింది. మీరిచ్చిన ఉచిత సలహాకు థ్యాంక్స్.. నా బరువుతో మీకేం పనిలేదు. మీరు అనవసరంగా ఆందోళన పడొద్దు. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటా. పట్టా అందుకున్నప్పుడు సంప్రదాయ దుస్తులే ధరించా. అందరిలాగా పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. నా గురించి కామెంట్ చేయడం మాని.. ముందు మీ పనిపై దృష్టి పెట్టండి.’ ఘాటూగానే బదులిచ్చింది. కాగా.. మలయాళ నటుడు సురేశ్ గోపీ తెలుగువారికి సుపరిచితులే. ఆయన పోలీస్ పాత్రలో నటించిన పలు మలయాళీ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.


