Palnadu Politics | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో మళ్ళీ మాటల యుద్ధం కొనసాగుతుంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస రావు. పాత శీనునైతే దుస్తులు విప్పి నడిరోడ్డుపై కొట్టేవాడినన్నారు. తాను మారాను కాబట్టే బతుకున్నారు… అంటూ యరపతినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాసు మహేశ్వర్ రెడ్డి వెంట్రుకతో సమానమని వ్యాఖ్యానించారు. అయితే యరపతినేని వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కాసు మహేష్ రెడ్డి. నన్నే ఎదుర్కోలేని వాడు.. జగన్ ను ఢీ కొంటారా? అంటూ ధీటైన సమాధానమిచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్ తో పోటీ పడగలరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలువలేని వారు పులివెందులలో పోటీ అంటారా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి బచ్చా గాళ్ళను చాలా మందిని చూశా అని ఎద్దేవా చేశారు మహేష్ రెడ్డి.