సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇంత వరకు ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ సెట్స్ పైకి రాకపోవడంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. ఇప్పుడు ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. జనవరి 2న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే ఈ మూవీని ప్రారంభించనున్నారని సమాచారం.
అయితే.. మహేష్ బాబు తన సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనడు. మరి.. సెంటిమెంట్ ప్రకారం ఈసారి ఈ మూవీ ఓపెనింగ్ లో పాల్గొంటాడా..? లేక సెంటిమెంట్ ప్రకారం నడుచుకుంటాడా..? అనేది తెలియాల్సివుంది. ఇందులో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది నిజమా..? కాదా..? రేపు తెలిసే అవకాశముంది. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జనవరి చివరి వారంలో ఈ పాన్ వరల్డ్ మూవీ సెట్స్ పైకి రానుంది. మరి.. ఈ క్రేజీ మూవీతో మహేష్, రాజమౌళి కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.