కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మరింత పటిష్టం చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరబోతుంది. రైతులకు కేంద్రం పంట నష్టం సాయం కూడా ప్రకటించింది. 23 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యం ఉండబోతుంది. ఈశాన్య రాష్ట్రాలకు 90 శాతం.. మిగిలిన రాష్ట్రాలకు 50 శాతం ఖర్చులను కేంద్రం భరించబోతుంది. డిజిటల్ రిమోట్ సెన్సింగ్ విధానంతో ఈ నష్టాన్ని గుర్తించబోతున్నట్లు తెలుస్తోంది.
2025ను రైతు సంక్షేమ ఏడాదిగా నిర్ణయించామని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. డీఏపీ ఎరువుల సబ్సిడీ అదనంగా రూ.3850 కోట్లతో వన్ టైమ్ ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.