ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం వద్దకు సోమవారం ఉదయం భక్తులు భారీగా చేరుకున్నారు. ‘పవిత్ర జలాల్లో’ స్నానం చేస్తున్నారు. ఇది మహా కుంభం 2025 ప్రారంభాన్ని తెలియజేస్తుంది. భారతదేశ, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 40 లక్షల మందికి పైగా యాత్రికులు ‘షాహి స్నాన్’ అనే పవిత్ర ఆచారాన్ని ఆచరించారు.
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగే 45 రోజుల మహా కుంభ ఉత్సవానికి 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఇది భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక సంప్రదాయాలను చాటుతుంది.. కుంభమేళాను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.
మహాకుంభ్ సందర్భంగా ప్రజల భద్రత కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు నగరం చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
సంగం ప్రాంతాల్లో నీటి అడుగున 100 మీటర్ల వరకు డైవింగ్ చేయగల డ్రోన్‌లను రౌండ్-ది-క్లాక్ నిఘా పెట్టడానికి నగరం అంతటా మోహరించినట్లు ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టెథర్డ్ డ్రోన్‌లు – అంటే 120 మీటర్ల ఎత్తుకు చేరుకోగల సామర్థ్యం ఉన్న డ్రోన్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఇవి జనసందోహంలో వైద్య సాయం, భద్రతా ప్రాంతాలను గుర్తించడానికి వైమానిక వీక్షణలను అందిస్తాయి.
ఎంట్రీ పాయింట్ల వద్ద రియల్ టైమ్ మానిటరింగ్ , ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని అందించే కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలతో కనీసం 2,700 కెమెరాలను ఏర్పాటు చేశారు.
దీంతో పాటు ఆన్‌లైన్ బెదిరింపులను పర్యవేక్షించడానికి 56 మంది సైబర్ బృందం , నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
అలాగే యాత్రికుల వసతి కోసం అధికారులు 150,000 టెంట్లు ఏర్పాటు చేశారు, అదనంగా మరుగుదొడ్లు , పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించారు. కనీసం 450,000 కొత్త విద్యుత్ కనెక్షన్‌లు వ్యవస్థాపించబడ్డాయి, ఒక నెలలో ఈ ప్రాంతంలోని 100,000 అర్బన్ అపార్ట్‌మెంట్‌లు వినియోగించే విద్యుత్ కంటే కుంభంమేళా ఎక్కువ విద్యుత్తును వినియోగించే అవకాశం ఉంది.