స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.. 20 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ నుండి కర్నూల్ కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న బస్సు త్రిపురాంతకం మండలం శ్రీనివాస్ నగర్ సమీపంలో ఓ లారీని ఢీకొట్టింది. అదుతప్పిన బస్సు రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయిన ఆర్టిసి డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో 12మంది ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ప్రమాధాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించేశారు..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుల ను మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుండటం తో వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు… జేసేపి సాయంతో బస్సు లో నుంచి డ్రైవర్ మృత దేహాన్ని బయటకు తీశారు.. పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..