ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు మహారాష్ట్రలోని పుణే కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో మరో ముగ్గురికి విముక్తి ప్రసాదించింది. హత్యలో కీలక పాత్రవహించిన సచిన్ అందూరే, శరద్ కలస్కర్ ను దోషులుగా నిర్ధారిస్తూ మహారాష్ట్ర పుణెలోని యూఏపీఏ కేసుల ప్రత్యేక కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. మరో ముగ్గురు నిందితులు వీరేంద్ర తావ్డే, విక్రమ్ భావే, సంజీవ్ పునలేకర్లను నిర్దోషులుగా ప్రకటించింది. శుక్రవారం కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ ను 2013 ఆగస్టు 20న పూణేలోని ఓంకారేశ్వర్ బ్రిడ్జిపై మార్నింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఐదుగురిని నిందితులుగా చేర్చారు. విచారణ ఏళ్ల పాటు సాగింది.


