22.9 C
Hyderabad
Sunday, February 22, 2026
spot_img

తెలంగాణ బీజేపీ నాయకత్వం మార్పుపై అధిష్టానం ఫోకస్‌

   తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ను నియమిం చనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు చేయాలని పార్టీ అగ్రనాయకత్వం భావి స్తోంది. కిషన్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్నారు. బీజేపీలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించ వచ్చని ప్రచారం జరుగుతోంది.

   కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఈటల రాజేందర్  తకు మోదీ మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో ఒకింత అసంతృప్తి చెందారని ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్ తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్దదైన లోక్ సభ నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి బరిలో దిగి 3 లక్షలకు పైగా భారీ మెజార్టీతో గెలిచారు. అయితే మాస్ లీడర్ అయిన ఈటలకు ఈసారి మోదీ కేబినెట్‌లో ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నా అది జరగలేదు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోన్న హైకమాండ్. పార్టీ బాధ్యతలను ఈటలకు అప్పగించనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్