36.2 C
Hyderabad
Friday, May 1, 2026
spot_img

విద్వేషాలను రెచ్చగొడుతున్న నేతల ప్రసంగాలు

   2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. కానీ, ప్రచారం సందర్భంగా నాయకులు, రాజకీయ వేత్తలు ప్రయోగిస్తున్న భాష దిగజారింది. విద్వేష పూరిత ప్రసంగాలు ఈ సారి ప్రచారంలో మితిమీరి పోయాయి. భాష హద్దులు దాటి విద్వేషం పెచ్చు పెరిగి పోతోందని రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామిక వాదులు వాపోతున్నారు. విద్వేషం రెచ్చ గొడితేనే.. ఓట్లు రాలతాయా. నాగరికత మరచి ఆవేశంతో నాయకులు ఎందుకు ఊగిపోతున్నారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

   రాజకీయం దిగజారి పోతోంది. ఎన్నికల ప్రచారంలో విద్వేషం రాజ్యమేలుతోంది. సమాజంలో విషాన్ని నింపే, విద్వేషం పెంచే ప్రసంగాలు మితిమీరాయి. ఢిల్లీ నాయకులనుంచి గల్లీ నాయకులవరకూ అందరి టోన్ ఒకే పిచ్ లో విన్పిస్తోంది. ఒకప్పుడు ఉమా భారతి, గిరిధర్ రాజ్ , నూపూర్ శర్మ, రాజా సింగ్ వంటి నాయకులు విద్వేష భాషకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేవారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా అదే భాషను అందుకున్నారు. ముఖ్యంగా ప్రధాని స్థాయికి ఏమాత్రం తగని విధంగా ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. దేశ సంపద అంతా ముస్లీంలకు దోచి పెడుతుందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశంలో హిందూ మహిళల మెడలో మంగళ సూత్రాన్ని కూడా గుంజుకుని ముస్లింలకు దోచి పెడుతుందన్నారు. కాంగ్రెస్ మేని ఫెస్టో లో.. ముస్లీంలీగ్ ముద్ర కన్పిస్తోందని మరో వ్యాఖ్య చేశారు. ప్రధాని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారాయి.

   విష పూరితమైన ప్రసంగాలు, విద్వేష పూరిత ప్రసంగాలు ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాలేదు. ప్రధాని మోదీ యే కాదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎంఐఎం వంటి పార్టీల నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతరులు విచక్షణా రహితంగా తమ ప్రసంగాల్లో దారుణమైన పద ప్రయోగం చేస్తున్నారు. గత ఏడాది కిందటేడాది జులై నెలలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ బెంగాలీ మాట్లాడే ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ కిరణ్ రిజిజు ఇదే విధమైన ప్రసంగాలు చేశారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ రాజస్థాన్ లో ఓ ఎన్నికల ప్రసంగంలో ముస్లీ మైనారిటీలపై విషం చిమ్మారు.మోదీ ప్రసంగం భారతీయ సమాజాన్ని హిందూ -ముస్లింలుగా విడగొట్టడమే లక్ష్యంగా సాగినట్లు కన్పిస్తోందని ప్రజాస్వామిక వాదులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. రామమందిర నిర్మాణంతో హిందువుల సెంటి మెంట్ రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ పెద్ద ప్రయత్నమే చేశారని అంటున్నారు. అది చాలదన్నట్లు కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ముస్లీం విద్వేష పూరిత ప్రసంగాలకు పాల్పడ్డారని పిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీగా, ప్రధానిగా పదవీ స్వీకారం చేసే సమయంలో కుల, మత, వర్ణాలతో సంబంధంలేకుండా దేశ ప్రజలందరి పట్ల పక్షపాత రహితంగా ప్రవర్తిస్తానని ప్రమాణం చేస్తారు. అలాంటి ప్రమాణాన్ని నిబద్ధతతో ఆచరిస్తేనే.. నిజమైన నాయకుడు. మోదీలో ఆ నిబద్ధత స్పష్టంగా లోపించింది.

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఓ స్థాయి వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గట్లు ప్రవర్తించాలి. రాజ్యాంగ పదవుల్లోఉన్నప్పుడు భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక, సర్వమత సమానత్వం పాటించాలి. 1990వ దశకంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. భారతరత్న అటల్ బిహారీ వాజపేయి ప్రధాని పదవి చేపట్టినా.. ఎన్నడూ మైనారిటీల పట్ల ఇటువంటి భావజాలం వ్యక్తం కాలేదు. 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గాడి తప్పింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే.. నరేంద్ర మోదీ.. ” ఇస్ బార్ 400 పార్ “అంటూ ఎన్డీఏ 400 పైగా సీట్లు సాధించాలని, బీజేపీ స్వయంగా 370 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 19న తొలివిడత 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్ ట్రెండ్.. బీజేపీకి ఎదురుగాలి వీచినట్లు కన్పించింది. కాంగ్రెస్ కూటమికి అనుకూల పవనాలు వీచినట్లు మీడియా ఘోషించింది. ఇది జీర్ణించుకోలేకనే .. ప్రధాని మోదీ విషం చిమ్ముతూ, విద్వేష పూరితమైన ప్రసంగం చేశారా. నిరాశ, నిస్పృహలతోనే… కాంగ్రెస్ పై అక్కసు తోనే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశ సంపద ముస్లీంలకు దోచి పెడుతుందని చెప్పడం ద్వారా.. మెజారిటీ హిందువులను తమ వైపు తిప్పుకునే కుట్ర పూరితమైన ప్రసంగం చేశారా అన్నది చర్చనీయాంశం.

     కాంగ్రెస్ పార్టీ మోదీ విద్వేష పూరిత ప్రసంగాలను ఖండిస్తూ.. గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రసంగాల్లోనే దేశం కోసం తమ కుటుంబం చేసిన త్యాగాలను పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశంలో హిందూ మహిళల మెడలో మంగళసూత్రాలను కూడా ముస్లింలకు దోచి పెడుతుందన్న మోదీ వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తూ.. ప్రియాంక తన తల్లి దేశంకోసం మంగళసూత్రం త్యాగం చేశారని పేర్కొన్నారు. త్యాగాలు చేయ డమే గాంధీ కుటుంబానికి తెలుసునని పేర్కొన్నారు. వారసత్వం రాజకీయాలపై మోదీ చేస్తున్న విద్వేష ప్రసంగాలను తెగనాడుతూ.. రాజీవ్ గాంధీ మరణం తర్వాత.. తమ కుటుంబంలో ఎవరైనా.. ప్రధాని పదవికానీ, ఏ పదవినైనా ఆశించారా అని నిలదీశారు. సోనియాగాంధీని ప్రధాని పదవి చేపట్టాలని పార్టీ నేతలు, శ్రేణులు కోరినా.మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసిన తన తల్లి త్యాగాన్ని ప్రియాంక ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు, మణిపూర్ ఇంఫాల్ నుంచి ముంబై వరకూ రెండు విడతల్లో భారత్ జోడో యాత్ర సాగించినా.. ఘాటైన ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రసంగాల్లో, ముఖ్యంగా కశ్మీర్ లో తొలిదశ భారత్ జోడో యాత్ర ముగింపు నాటి ప్రసంగంలో ఒకదశలో హద్దు దాటినా.. మోదీ స్థాయిలో విద్వేషం, విషం వెదజల్లలేదు.

ఏది ఏమైనా.. ప్రధాని ప్రసంగం కేవలం ముస్లిం వ్యతిరేకతతో , కాంగ్రెస్, ముస్లిం అనుకూల పార్టీలపై అక్కసుతో సాగిందే. హిందువుల్లో ముస్లింల పట్ల విద్వేషం పెంచి లోక్ సభ ఎన్నికల్లో మిగతా దశల్లో అయినా అడ్వాంటేజ్ పొందే లక్ష్యంతో ఈ ప్రసంగాలు సాగాయని ప్రజాస్వామిక వాదులు భావిస్తున్నారు. ఈ విద్వేష పూరిత ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందినా.. మోదీ పై చర్య తీసుకునే పరిస్థితి లేదనేది బహిరంగ రహస్యం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్