ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటించి 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిత్రం ‘లూసిఫర్’. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2ఇ ఎంపురాన్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. కంటెంట్ సినిమాలతో పాటు.. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. లూసిఫర్, బ్రో డాడీ చిత్రాల తర్వాత మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది. ఈ క్రేజీ మూవీతో జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతృత్వంలో లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మలయాళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తొలి భాగం లూసిఫర్ హిట్ కావటంతో సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. అనౌన్స్మెంట్ రోజు నుంచే సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘L2ఇ ఎంపురాన్’ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లేలా మేకర్స్ ఆదివారం నాడు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
ప్రియదర్శిని రాందాస్ పాత్రను పోషించిన మంజు వారియర్ మాట్లాడుతూ.. ‘ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్లో ఎన్ని చిత్రాలు చేశానో కూడా నాకు గుర్తులేదు. లూసిఫర్‌లో నా పాత్ర కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. ఈ సీక్వెల్‌ని కూడా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
టోవినో థామస్ మాట్లాడుతూ..‘నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని పృథ్వీరాజ్ నాతో చెప్పారు. ఆర్టిస్ట్‌గా జతిన్ రాందాస్ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎంపురాన్పై భారీ అంచాలు ఉన్నాయి. లలెట్టాన్‌తో స్క్రీన్‌ను పంచుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టం. ఈ ప్రయాణంలో ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని అన్నారు.
దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంతో మాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న లైకా ప్రొడక్షన్స్‌కు స్వాగతం. వారికి ఈ ఎంపురాన్ సినిమా గొప్ప డెబ్యూ అవుతుందని ఆశిస్తున్నాను. మా సోదరుడు, మా నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇస్తూనే వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రయాణంలో ప్రతీ క్షణం ఆయన నాతోనే ఉన్నారు. మోహన్ లాల్ గారు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఈ ప్రయాణంలో ఆయన నాకెంతో సపోర్ట్ ఇచ్చారు. వాతావరణ పరిస్థితుల కారణంగా మోహన్ లాల్ గారిని ఓ వారం మొత్తం ఖాళీగా కూర్చోబెట్టాను. అప్పుడు ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు. సినిమా నిర్మాణం పైనే దృష్టి పెట్టమని చెప్పారు’ అని అన్నారు.
మోహన్ లాల్ మాట్లాడుతూ.. ‘ఆశీర్వాద్ సినిమాస్‌తో కలిసి సినిమాను నిర్మించిన లైకాకు ధన్యవాదాలు. పృథ్వీరాజ్ యాక్సిడెంటల్ డైరెక్టర్ అని ఆయన అన్నారు. కానీ అది సరి కాదు. పృథ్వీరాజ్ భారతదేశపు ఉత్తమ దర్శకుల్లో ఒకరు అవుతారని నేను ఆశిస్తున్నాను. ఎంపురాన్ షూటింగ్ టైంలో మేము చాలా సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మూవీని నేను ఆల్రెడీ చూశాను. దర్శకుడిగా పృథ్వీరాజ్ తన 100 పర్సెంట్ ఇచ్చారు. ఎంపురాన్ మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం మలయాళ సినిమాకు ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంద’ ని అన్నారు.