తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అశాంతి నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థని ప్రతిష్ట పరచాలంటే హోం మంత్రి బాధ్యతలను ఎవరికైనా అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. అబంర్‌పేటలో ఇటీవల హత్యకు గురైన రిటైర్ బ్యాంక్ మేనేజర్ లింగారెడ్డి దంపతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. రాష్ట్రంలో హోం శాఖ మంత్రిని నియమిస్తేనే శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయని కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో జరిగిన హత్య ఘటనకు తమ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని జీవన్ రెడ్డి తెలిపారని కేటీఆర్ గుర్తు చేశారు.