ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఫార్ములా-ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని కేటీఆర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార అరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేస్‌ను కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా -ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని.. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. కావాలనే ఈ రేస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.