తెలంగాణ రాజకీయాల్లో బాంబుల వార్ నడుస్తోంది. త్వరలోనే పొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సియోల్ వేదికగా వెల్లడించడం పాలిటిక్స్‌లో కలకలం రేపింది. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒకటే చర్చ సాగుతోంది. ఏ కేసులో అరెస్ట్‌లు ఉంటాయోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నో ఊహాగానాలు సాగుతున్న వేళ మంత్రి కామెంట్లకు కౌంటరిచ్చారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒరిజినల్ బాంబులకే తాము భయపడలేదన్నారు. చిట్టి నాయుడు బెదిరింపులకు భయపడేది లేదన్న ఆయన.. కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండని వ్యాఖ్యానించారు. బాంబులు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ల గురించి చెబుతారేమో అంటూ సెటైర్లు వేశారు.


