తెలంగాణలో ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణ మాఫీ అయిందని రైతులు రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణను ఉద్ధరించిన.. ఢిల్లీని కూడా ఉద్దరిస్తానంటూ సీఎం రేవంత్ అంటున్నారని ఎద్దేవా చేశారు. షాబాద్‌లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన ప్రసంగించారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గతంలో రైతు బంధుకు అడ్డుగా పిటిషన్ వేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ మహిళలు, రైతులు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.