తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని.. అర గ్యారెంటీ అమలు చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలని.. అర గ్యారెంటీ అమలు చేశారని విమర్శించారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎంత మందికి రుణమాఫీ చేశారనంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను గంగలో కలిపి,… ఢిల్లీ ఎన్నికల్లో మళ్లీ గ్యారెంటీలు మొదలు పెట్టారంటూ మండిపడ్డారు.